calender_icon.png 24 January, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదేళ్లుగా ఒక్క రేషన్ కార్డు లేదు

23-01-2025 12:14:36 AM

ఎమ్మెల్యే తూడి మేఘా రెడ్డి

వనపర్తి, జనవరి 22 (విజయక్రాంతి): గత పదేళ్లుగా పాలించిన బి ఆర్ ఎస్ పార్టీ  నిరుపేదలకు ఒక్క రేషన్ కార్డు జారీ చేయలేదని, గ్రామాలలో ఏడాదికో 10 ఇండ్లు నిరుపేదలకు అందించిన బడుగు బలహీన వర్గాలకు లబ్ధి చేకూరేదని, వీటిపై దృష్టి సారించకుండా సొంత లాభం చూసుకున్నారని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి విమర్శించారు. 

ప్రజాపాలన గ్రామసభల కార్యక్రమంలో భాగంగా బుధవారం వనపర్తి మండలం సవాయిగూడెం క్రిష్ణగిరి గ్రామాల్లో, వనపర్తి పట్టణం లోని పలు వార్డులో నిర్వహించిన గ్రామ, వార్డు సభల్లో వేరువేరుగా ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. గ్రామాల్లోని నిరుపేదలు గత ప్రభుత్వ పాలనలో పదేళ్లు  దగాపడ్డారని నేడు ఇందిరమ్మ రాజ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ ఫలాలు అందుతాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

రైతు భరోసా,... భూమిలేని నిలుపేదలకు అందించే రూ 12,000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా,... రేషన్ కార్డుల పంపిణీ,  ఇందిరమ్మ ఇండ్ల అందజేతకు సంబంధించి నేడు జరుగుతున్న గ్రామసభల్లో ప్రతి ఒక్కరు దరఖాస్తు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

అధికారులు తయారు చేసిన జాబితాలో కొందరు పేర్లు ఉండొచ్చు ఉండకపోవచ్చునని అలాంటివారు ఎలాంటి నిరాశకు గురి కాకుండా నేడు దరఖాస్తు చేసుకోవచ్చని ఎమ్మెల్యే సూచించారు.  అధికారులు, పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.