calender_icon.png 27 October, 2024 | 12:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీఆర్‌ఎస్‌కు తెర ముందు ఇద్దరే.. తెర వెనకా ఇద్దరే..

27-10-2024 02:17:54 AM

ప్రతిపక్ష బీఆర్‌ఎస్ పార్టీలో ఇద్దరు నేతలు ముందుండి ప్రభుత్వంపై పోరు చేస్తున్నారు. మూసీ లక్షన్నర కోట్ల స్కాం, హైడ్రా కూల్చివేతలపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు రేవంత్ సర్కార్‌పై విమర్శలు కురిపిస్తున్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడు ప్రజల మధ్యకు వస్తారని కార్యకర్తలు, ప్రజలు ఎదురు చూస్తున్నా.. బావ బామ్మర్థులే పార్టీ పడవ నడుపుతున్నారు.

భవిష్యత్తులో పార్టీ ఈ ఇద్దరికి చేతిలోకి వస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పదేళ్లు సీఎంగా పనిచేసిన కేసీఆర్ అధికారం కోల్పోయిన తరువాత అడపాదడపా ప్రజలకు కనిపించారు. పార్లమెంటు ఎన్నికలు, ఒకరోజు బడ్జెట్ సమావేశాలకు హాజరై జాడ లేకుండా పోయాడు.

అదేవిధంగా  తెలంగాణ జాగృతి పేరుతో తనకంటూ ప్రత్యేక ముద్రవేసుకున్న ఎమ్మెల్సీ కవిత జైలు నుంచి వచ్చిన తరువాత ఫామ్‌హౌస్‌కు వెళ్లి ఇప్పటివరకు అభిమానులకు, కార్యకర్తల కంట పడలేదు. తండ్రి, కూతురు తెర వెనక ఉండి పార్టీ నిర్మాణం కోసం వ్యూహాలు రచిస్తున్నారా, లేక పార్టీకి దూరమైతారా అనే గుసగుసలు గులాబీ పార్టీలో వినిపిస్తున్నాయి. పార్టీకి అధినాయకుడు ఎవరో సీనియర్లు  తేల్చుకోలేక పోతున్నారు.