calender_icon.png 7 January, 2025 | 9:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్వీయ నాశనానికి మూడు ద్వారాలు..

03-01-2025 05:34:06 PM

స్వీయ నాశనానికి మూడు ద్వారాలున్నాయి.. ఇది నువ్వో నేనో చేసే పని కాదు దిమాక్ ఉన్నోడే చేయాలి.. ఒకడు తాచుపాము తోకని తొక్కాడు.. తొక్కిన వాడ్ని పాము కాటేయబోతోంది.. మరి తొక్కించిన వాడి సంగతేంటి?’.. అంటూ అదిరిపోయే డైలాగ్స్‌తో సాగింది త్రిబాణ ధారి బార్బరిక్’ చిత్రం టీజర్. ఇంకా ఈ టీజర్‌లో ఎన్నో ఆకట్టుకునే హైలెట్స్ ఉన్నాయి. సత్యరాజ్, వశిష్ట, సత్యం రాజేశ్ ఇలా చాలా పాత్రలకు ఉన్న ప్రాధాన్యాన్ని ఇందులో చూపించారు. ఇక టీజర్ ఆఖరలో వదిలిన షాట్స్, చూపించిన గెటప్స్ నెక్ట్స్ లెవెల్ అనిపిస్తాయి. ఇప్పటికే విడుదల చేసిన మోషన్ పోస్టర్ ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది.

తాజాగా మేకర్స్ ఈ చిత్ర టీజర్‌ను రిలీజ్ చేయగా, కొత్త పాయింట్.. అంటూ సినీ ప్రియుల నుంచి స్పందన వస్తోంది. స్టార్ డైరెక్టర్ మారుతి సమర్పణలో దర్శకుడు మోహన్ శ్రీవత్స తెరకెక్కిస్తున్న చిత్రమిది. వానర సెల్యూలాయిడ్ బ్యానర్‌పై విజయపాల్‌రెడ్డి అడిదల నిర్మిస్తున్నారు. సత్యరాజ్, వశిష్ట ఎన్ సింహ, సాంచి రాయ్, ఉదయభాను, సత్యం రాజేశ్, క్రాంతికిరణ్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. ఈ చిత్రానికి డీవోపీ: కుశేందర్ రమేశ్‌రెడ్డి; సంగీతం: ఇన్ఫ్యూషన్ బ్యాండ్; ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేశ్; ఆర్ట్ డైరెక్టర్: శ్రీనివాస్ పున్నాస్; ఫైట్స్: రామ్ సుంకర; కాస్ట్యూమ్ డిజైనర్: మహి డేరంగుల.