28-02-2025 05:43:04 PM
ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదు... రావులపల్లి రాంప్రసాద్
చర్ల (విజయక్రాంతి): బిఆర్ఎస్ పార్టీ మండల కార్యాలయంలో మండల కన్వీనర్ దొడ్డి తాతారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న భద్రాచలం నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రావుల పల్లి రాంప్రసాద్ మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు అని మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి దాదాపు 14 నెలలు దాటుతున్న ఇచ్చిన హామీ ఏ ఒక్కటి కూడా నెరవేర్చలేదని, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భద్రాచలం నియోజకవర్గ ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారని అన్నారు. తెల్లం వెంకట్రావు బిఆర్ఎస్ పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యేగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంతో కష్టపడి ఎమ్మెల్యేగా వెంకట్రావుని గెలిపిస్తే పార్టీని మోసం చేసి అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన దగ్గర నుండి భద్రాచలం నియోజకవర్గంలో ఏమి అభివృద్ధి చేసారో చెప్పాలన్నారు.
చర్ల నుండి వెంకటాపురం వెళ్ళె రహదారి ఎంత అధ్వానంగా ఉందో అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యేకి కనబడట్లేదా, అదేవిధంగా తాలిపేరు సాగు నీరు అందక చేతికందిన వరి పంట ఎండిపోతుంది, నీటిపారుదల శాఖ అధికారులు తక్షణం స్పందించి తాలిపేరు కింద పొలాలకు నీటిని విడుదల చేయాలి, అలాగే ఏకన్నగూడెం వద్ద బ్రిడ్జి కుంగి మూడు నెలలు కావస్తున్న అధికారులు కానీ ఎమ్మెల్యే కానీ ఇంతవరకు దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు అని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ అజీజ్ పంజా రాజు తడికల బుల్లేబ్బాయి బీసీ సెల్ మండల అధ్యక్షులు గోరింట్ల వెంకటేశ్వరరావు టౌన్ కార్యదర్శి గాదంశెట్టి కిషోర్ టౌన్ యూత్ కార్యదర్శి కుక్కడప్పు సాయి సృజన్ తదితరులు పాల్గొన్నారు.