calender_icon.png 23 September, 2024 | 3:55 AM

దేశంలో ఏడున్నర కోట్ల మంది ఈపీఎఫ్ లబ్ధిదారులు

22-09-2024 02:15:33 AM

కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవీయ

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాంతి): దేశంలో ఏడున్నర కోట్ల మంది ఈపీఎఫ్ లబ్ధిదారులు ఉన్నట్లు కేంద్ర కార్మిక, యువజన, క్రీడాశాఖ మంత్రి మన్సు ఖ్ మాండవీయ తెలిపారు. శనివారం హైదరాబాద్ బర్కత్‌పూరలోని ఈపీఎఫ్ కార్యాల యాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఈపీఎఫ్ సంస్థ పనితీరును ఆయన సమీక్షించారు. జోనల్ కార్యాలయంలోని సమస్యలను ఉద్యోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడు తూ 77 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నట్లు తెలిపారు.

పరిశ్రమల్లో పనిచేసే వారికి ఈపీఎఫ్ కట్ అయ్యే వారికి పెన్షన్ కూడా వస్తుందన్నారు. ఈపీఎఫ్ వల్ల ఉద్యోగుల భవిష్యత్‌కి భరోసా లభిస్తుందని పేర్కొన్నారు. యువ ఉద్యోగుల కోసం ఈ బడ్జెట్‌లో ఎంప్లాయిమెంట్ లింక్ యోజన పథకాన్ని తీసుకొచ్చామని, అది వారికి చాలా ఉపయుక్తంగా ఉంటుందని తెలిపారు. కార్మికుల క్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపడుతోందని కేంద్రమంత్రి పేర్కొన్నారు.