calender_icon.png 25 April, 2025 | 11:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యూజీసీ, లీగల్ అడ్డంకులు లేవు

25-04-2025 12:00:00 AM

  1. మా సమస్యలపై అధికారుల తప్పుడు సమాచారం 
  2. కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు
  3. యూనివర్సిటీల్లో కొనసాగుత్ను సమ్మె

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 24 (విజయక్రాంతి): తమ సమస్యలను పరిష్కరించేందుకు యూజీసీ, న్యాయమపరమైన అడ్డంకులేవీ లేవని, అయినా కూడా కొందరు అధికారులు ప్రభుత్వానికి తప్పుడు సమచారం ఇస్తున్నారని తెలంగాణ రాష్ట్ర కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల (టీజీయూటీఏ) జేఏసీ నాయకులు డాక్టర్ ధర్మతేజ, డాక్టర్ పరశురాం, డాక్టర్ కుమార్, డాక్టర్ ఉపేందర్ అన్నారు.

కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులర్ చేయాలని టీజయూటీఏ జేఏసీ ఆధ్వ ర్యంలో చేపట్టిన సమ్మె గురువారం ఆరోరోజుకు చేరింది. వివిధ యూనివర్సిటీల్లో జరిగిన కార్యక్రమాల్లో కాశ్మీర్‌లో ఉగ్రదాడిలో చనిపోయిన వారికి సంతాపం తెలుపుతూ మౌనం పాటించారు. టీజీయూటీఏ నా యకులు మాట్లాడుతూ.. పలు యూనివర్సిటీల్లోని కొంతమంది అధికారు లు ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇవ్వడం మానుకోవాలని చెప్పారు.

కాకతీయ యూనివర్సి టీ పరిపాలన భవనం నుంచి రెండో గేటు వరకు ప్రొఫెసర్లు ర్యాలీ నిర్వహించి రాస్తారోకో నిర్వహించారు. అనంతరం పరిపాలనభ వనం ఎదుట దీక్ష నిర్వహించారు. వారికి బీజేపీ మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, ఎమ్మార్పీఎస్ జాతీ య నాయకులు మంద కుమార్‌మాదిగ, సీపీఎం జిల్లా కా ర్యదర్శి గాదె ప్రభాకర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు.

హైదరాబాద్ జేఎన్‌టీయూలో కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలకు వ్యతిరేకంగా పని చేస్తున్న వారి దిష్టిబొమ్మలకు ఉరివేసి నిరసన తెలిపారు. జేఎన్‌టీయూ మంథనిలో కాంట్రాక్టు అధ్యాపకుల సమ్మెకు విద్యార్థులు భారీ సంఖ్యలో హాజరై మద్దతు తెలిపారు. అంబేద్కర్ యూనివర్సిటీలోని అంబేద్కర్ విగ్ర హం ఎదుట నిరసన తెలిపారు.