బిజెపి జిల్లా అధికార ప్రతినిధి పోతరవేని క్రాంతి
మంథని,(విజయక్రాంతి): పెద్దపెల్లి జిల్లాలోని పలు గ్రామాలలో సీజనల్ వ్యాధులు వ్యాపించి ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతుంటే గ్రామాలలో ప్రత్యేక అధికారులు మాత్రం కరువయ్యారని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి పోతరవేని క్రాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం క్రాంతి మాట్లాడుతూ గ్రామాలలో ప్రజలు అనేక వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారని గ్రామాలలో ప్రజలను పట్టించుకునే నాధుడే కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
జిల్లావ్యాప్తంగా జ్వరాలు ఎక్కువగా ఉన్న గ్రామాలలో స్పెషల్ డ్రైవ్ లు నిర్వహించడం లేదని సీజన్ వ్యాధుల పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదన్నారు. పీహెచ్సీలలో సిబ్బంది కొరతతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, వెంటనే ఆసుపత్రిలలో అధిక సిబ్బందిని నియమించాలని డిమాండ్ చేశారు.. ప్రత్యేక అధికారులు వెంటనే చొరవ తీసుకొని ప్రజలను రోగాల బారిన పడకుండా వైద్య సిబ్బందితో కలిసి స్పెషల్ డ్రైవ్ లు నిర్వహిస్తూ ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలను రోగాల బారి నుండి కాపాడాలని క్రాంతి అధికారులను కోరారు.