హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 8(విజయక్రాంతి): ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్‌ను ఉపయోగించుకుని విద్యార్థులు పని చేయాలని ప్రపంచ బ్యాంక్ అంతర్జాతీయ వ్యవహారాల మాజీ మేనేజర్ ఎరిక్‌చింజే సూచించారు. శనివారం ఓయూ ఆర్ట్స్ కాలేజీలో జరిగిన ఓయూ పూర్వ విద్యార్థి, విద్యావేత్త సర్వత్ హుస్సేన్ స్మారక సభలో ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కాశీంతో కలిసి ఎరిక్ చింజే స్మారకోపాన్యాసం చేశారు. సర్వత్ హుస్సేన్ ఉన్నత విలువలు కలిగిన వ్యక్తిగా జీవించాడన్నారు. కార్య క్రమంలో జర్నలిజం హెచ్‌వోడీ సతీశ్‌కుమార్, ప్రొఫెసర్ కే నరేందర్ తది తరులు పాల్గొన్నారు.