calender_icon.png 21 April, 2025 | 4:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గంజి నీళ్లతో లాభాలెన్నో!

20-04-2025 12:00:00 AM

గంజి నీళ్లలో విటమిన్ ఇ, మెగ్నీషియం, ఫైబర్, జింక్, మాంగనీస్ వంటి పోషకాలున్నాయి. ప్రతిరోజూ ఒక గ్లాసు గంజి నీళ్లలో కొద్దిగా ఉప్పు కలిగి తాగడం వల్ల అధిక బరువు అదుపులో ఉండటమేకాకుండా.. శక్తి కూడా పెరుగుతుంది. గంజి నీళ్లు జీర్ణ సమస్యలకు సరైన పరిష్కారం. శరీరంలో కొవ్వు పేరుకుపోవడాన్ని నియంత్రిస్తుంది. పోషకాలను గ్రహించడంలో సహాయపడుతుంది.

ఆకలిని అరికట్టడానికి, శరీరంలో హైడ్రేషన్ స్థాయిని పెంచడానికి గంజి నీరు కీలకపాత్ర పోషిస్తుంది. గంజి నీళ్లలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు గంజి నీళ్లు తాగడం వల్ల ఆయా సమస్య నుంచి కొంతమేర బయటపడొచ్చు. గంజి నీళ్లు తాగడం వల్ల ఆకలి అదుపులో ఉంటుంది. తద్వారా తరచుగా భోజనం చేసే అలవాటును దూరం చేసుకోవచ్చు. గంజి నీళ్లలో కొద్దిగా పెరుగు, ఉప్పు కలిపి తాగడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉండొచ్చు.