calender_icon.png 4 February, 2025 | 4:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కులగణనలో లోపాలున్నాయి

04-02-2025 12:58:41 AM

  1. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక నివేదికనివ్వాలి
  2. రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు
  3. కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద డ్రామా నడిపింది: జాజుల 

హైదరాబాద్ సిటీబ్యూరో, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేసినందుకు అభినందిస్తున్నామని, కానీ అందులో లోపాలున్నాయని రిటైర్డ్ ఐఏఎస్ టీ చిరంజీవులు అన్నారు. సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరమ్ ఆధ్వర్యంలో సోమవారం జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులతో కలిసి మీడియా సమా  నిర్వహించారు.

ఈ సందర్భంగా చిరంజీవులు మాట్లాడుతూ 2024, ఫిబ్రవరి 15న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసి, మార్చి 15న జీవో విడుదల చేసిందన్నారు. సమగ్ర కుటుంబ సర్వే ఎంసీఆర్, హెచ్‌ఆర్‌డీ వెబ్‌సైట్‌లో ఉన్న వివరాల ప్రకారం ఎస్సీలు 18, ఎస్టీలు 10, హిందూ బీసీలు 51 శాతం, ముస్లీం బీసీలు 10 శాతం, ఇతరులు 8 శా  మంది ఉన్నారన్నారు.

ఈ డాటా సరికాకపోతే రాష్ట్ర ప్రభుత్వం సరైన డాటాను ఇ  ‘అందులోని వివరాల ప్రకారం ఎస్సీలు తగ్గారు.. ఎస్టీలు పెరిగారు.. బీసీల జనాభా 21 లక్షలు తగ్గింది. ఇవి సరైన లెక్క  కావు. సర్వేలో అందరూ పాల్గొనలేదు’ అని చెప్పారు. ఈ రిపోర్టు సరిగా లేదని, బీసీలకు అన్యాయం జరుగబోతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ లోపాలను చిత్తశుద్ధితో ప్రభుత్వం సవరించాలని కోరారు. మొబైల్ యాప్‌ను, డాటాను వెబ్‌సైట్‌లో పెడితే పారదర్శకంగా ఉంటుందన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు లభిస్తాయన్నారు. రిపోర్టుపై సంఘాల అభిప్రాయాలు తీసుకోవాలన్నారు. 

కులగణన వివరాలు కాకమ్మకథలు: జాజుల శ్రీనివాస్

సమగ్ర కుటుంబ సర్వే పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం పెద్ద డ్రామాను నడిపిందని, ఆదివారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విడుదల చేసిన కులగణన వివరాలు కాకమ్మకథలు, కట్టుకథలని ఇందులో వంద శాతం కుట్ర దాగి ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన కుల గణన సమగ్రంగా, సంపూర్ణంగా, శాస్త్రీయంగా లేదని ఆరోపించారు.

బీసీలను సామాజికంగా, రాజకీయంగా అణచివేసి అగ్రకులాల పాలనను తెలంగాణలో సాగించేందుకు కుట్ర జరుగుతోందని విమర్శించారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుందని ఎద్దేవా చేశారు. 2011లో జనాభాలెక్కలు, 2014లో సమగ్ర కుటుం  సర్వే జరిగిందని, ఈ క్రమంలో జనాభా పెరిగిందన్నారు.

కానీ 2024లో జరిగిన సమగ్ర కులగణనలో జనాభా తగ్గినట్లు చూపిం  ఆ లెక్కల ప్రకారం పదేండ్లలో బీసీల జనాభా 21 లక్షలు తగ్గిందని, ఓసీల జనాభా 16 లక్షలకు పెరిగిందని నివేదిక ఇచ్చారని విమర్శించారు. సమగ్ర కుటుంబ సర్వేలో అగ్రకులాలు, సంపన్న వర్గాలు, గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్‌మెంట్‌లు పాల్గొన  కానీ వారి జనాభాను ఎక్కువగా ఎలా చూపిస్తారని ప్రశ్నించారు.