03-03-2025 07:41:04 PM
చేర్యాల (విజయక్రాంతి): జనగామ జిల్లా డిసిసి అధ్యక్షుడైన కొమ్మూరు ప్రతాపరెడ్డికి ఎమ్మెల్సీ పదవి రావాలని ఆకాంక్షిస్తూ మల్లన్న ఆలయంలోని గంగ రేణు చెట్టుకు కాంగ్రెస్ నాయకులు ముడుపులు కట్టి ప్రత్యేక పూజలు జరిపారు. నాలుగు మండలాల నుండి కాంగ్రెస్ కార్యకర్తలు సోమవారం మల్లన్న క్షేత్రానికి భారీగా తరలివచ్చారు. అనంతరం స్వామివారి ముఖమండపం వద్ద ప్రత్యేక పూజలు జరిపారు. ఈ సందర్భంగా చేర్యాల, మండల పట్టణ అధ్యక్షులు కొమ్ము రవి, దాసరి శ్రీకాంత్ లు మాట్లాడుతూ... ఇప్పటికే నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న కొమ్మూరికి అధిష్టానం ఎమ్మెల్సీ పదవి కేటాయించినట్లయితే, అభివృద్ధిని పరుగులు పెట్టిస్తురన్నారు.
పార్లమెంటు ఎలక్షన్లో ఎంపీ చామల్లకు అత్యధిక మెజార్టీ తేవడంలో శక్తివంచన లేకుండా కృషి చేశారన్నారు. ఆయన సారధ్యంలో రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో కాంగ్రెస్ జెండా ఎగరవేయడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పుర్మా ఆగం రెడ్డి, ఆలయ పాలక మండలి సభ్యులు అల్లం శ్రీనివాస్, లింగంపల్లి శ్రీనివాస్, మామిడాల లక్ష్మి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండారి కనకయ్య తదితరులు పాల్గొన్నారు.