14-04-2025 01:24:05 AM
వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ప్రారంభంలో దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్‌రెడ్డి
మూసాపేట ఏప్రిల్ 13 : రైతు శ్రమించి పండించిన వరి ధాన్యం కొనుగోలులో ఎ లాంటి తరుగు కోతలు ఉండవని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి స్పష్టం చేశా రు. ఆదివారం దేవరకద్ర మండలంలోని గుడిబండ, మూసా పేట మండలంలోని కొమిరెడ్డిపల్లి గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుకు ఎలాంటి నష్టం వాటిల్లకుం డా చివరి వడ్ల గింజ వరకు కొనుగోలు చేస్తామని తెలిపారు. చెప్పుడు మాటలు విని ఎట్టి పరిస్థితుల్లో మోసపోకూడదని అందరి సంక్షేమం కోసమే ప్రజా ప్రభుత్వం ప్రయా ణం అద్భుతంగా కొనసాగిస్తుందని పేర్కొ న్నారు. ఒక్కొక్కటిగా ప్రజా ప్రభుత్వం అన్ని పథకలను అమలు చేస్తుందని తెలిపారు.
ఆరోగ్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలను అందుబాటులో ఉంచుతుందని, ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించుకున్న వారికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆదుకోవడం జరుగుతుందన్నారు. పేదలకు అన్ని రంగాల్లో సముచిత స్థానం కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని స్పష్టం చేశారు. అనంతరం పలువురికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉదయ్ కుమార్ రెడ్డి, తదితరులు ఉన్నారు.