calender_icon.png 28 October, 2024 | 6:43 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పుడే బెంగాల్‌లో శాంతి

28-10-2024 12:00:00 AM

  1. బంగ్లా నుంచి చొరబాట్లు ఆగితేనే సాధ్యం
  2. కేంద్రహోంమంత్రి అమిత్ షా

కోల్‌కతా, అక్టోబర్ 27: బంగ్లాదేశ్ నుంచి భారత్‌కు అక్రమ వలసలు ఆగితేనే బెంగాల్‌లో శాంతి నెలకొంటుందని కేంద్రహోంమంత్రి అమిత్ షా అన్నారు. అక్రమ చొరబాట్లు రెండు దేశాల మధ్య శాంతియుత సంబంధాలకు విఘాతం కలగిస్తాయని అన్నారు. పశ్చిమబెంగాల్‌లోని భారత్, బంగ్లా సరిహద్దుల్లోని పెట్రాపోల్ ల్యాండ్ పోర్టులో కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనం, కార్గో గేట్ ప్రారంభించిన సందర్భంగా అమిత్ షా మాట్లాడారు.

2026లో బెంగాల్‌లో బీజేపీ అధికారం చేపడితే బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను అరికట్టవచ్చని చెప్పారు. ఇలాంటి ప్రాంతాల్లో శాంతిని నెలకొల్పేందుకు ల్యాండ్ పోర్టులు ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. రెండు దేశాల మధ్య కనెక్టివిటీ, సంబంధాలను మెరుగుపరచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. వాణిజ్య సంబంధాలనూ మెరుగుపరుస్తాయని చెప్పారు. కాగా, బెంగాల్ అభివృద్ధి కోసం మోదీ ప్రభుత్వం పంపిన నిధులను టీఎ ంసీ సర్కార్ దోచుకుంటోందని ఆరోపించారు.