calender_icon.png 7 March, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పుడు కొడుకులు.. ఇప్పుడు తండ్రితో..

06-03-2025 12:00:00 AM

పూజా హెగ్డే.. ఒకప్పుడు టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలిగింది. ప్రభాస్, ఎన్టీఆర్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, రామ్‌చరణ్, నాగచైతన్య, అఖిల్, వరుణ్ తేజ్ వంటి హీరోలతో రొమాన్స్ చేసిందీ బుట్టబొమ్మ. ఇప్పుడు కంటెంట్ ఉన్న సినిమాలు, బలమైన పాత్రలకే ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే తమిళంలో విజయ్‌తో ‘జననాయగన్’, సూర్యతో ‘రెట్రో’ చిత్రాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.

మరోవైపు రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న ‘కూలీ’లో ఈ ముద్దుగుమ్మ ప్రత్యేక గీతంతో అలరించనున్నట్టు సమాచారం. స్పెషల్ సాంగ్ చేయటం పూజకు ఇదేం కొత్త కాదు. హీరోయిన్‌గా క్రేజ్ ఉన్నప్పుడే ‘రంగస్థలం’లో జిగేల్‌రాణిలా మెరిసింది. ఇప్పుడు దాన్ని మించేలా ‘కూలీ’ ఐటెమ్ సాంగ్ ఉంటుందట. ‘కూలీ’లో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే.

కథలో భాగంగా ఓ పార్టీలో ఊరమాస్ పాటలో టాలీవుడ్ ‘మన్మధుడి’తో పూజ రెచ్చిపోతుందంటున్నారు. ఇప్పటికే నాగ్ తనయులు నాగచైతన్యతో ‘ఒక లైలా కోసం’, అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రాల్లో జత కట్టిన పూజా హెగ్డే ఇప్పుడు వాళ్ల తండ్రి నాగార్జునతో చిందు లేయనుందన్న వార్త ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది!