calender_icon.png 6 March, 2025 | 11:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అప్పుడు 30 నిమిషాలకే ఏడ్చేశా!

06-03-2025 12:00:00 AM

చాలా కాలం తర్వాత నటి లైలా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఒకప్పుడు వరుస చిత్రాలతో ప్రేక్షకు లను పలకరించిన ఆమె.. ఆ తరువాత వివాహం చేసుకుని వెండితెరకు దూరమైంది. తాజాగా ‘శబ్దం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. కాస్త బొద్దుగా తయారైన లైలా.. ఈ చిత్రంలో ప్రతినాయిక పాత్ర పోషించింది. గోవాకు చెందిన లైలా.. 1996 వరకూ టాలీవుడ్‌లో తన హవా నడిపించింది. తెలుగు, తమిళ భాషల్లో వరుస సినిమాలు చేసింది.

ఆమె నటించిన కొన్ని చిత్రాలు ఎవర్‌గ్రీన్. ఉగాది, ఖైదీ గారు, పవిత్రప్రేమ, లవ్ స్టోరీ 1999, శుభలేఖలు, నా హృదయంలో నిదురించే చెలి, శివపుత్రుడు తదితర చిత్రాల ద్వారా ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. అనంతరం 2006లో మెన్ మెహన్దీని వివాహం చేసుకుని నటనకు దూరమైంది. ఇటీవల కాలంలో ‘శబ్దం’తోపాటు ‘సర్దార్, ది గోట్’ చిత్రాల్లో నటించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తనకు ఒక వ్యాధి ఉందని.. అది నవ్వు వ్యాధి అని చెప్పుకొచ్చింది.

అప్పట్లో లైలా మీద ఉన్న కంప్లుంటే అది. ఆమె ఫేస్‌లో నవ్వు తప్ప ఇతర ఎక్స్‌ప్రెషన్ పెద్దగా కనిపించదని ప్రేక్షకులు చెప్పుకునేవారు. తాజాగా తను కూడా అదే చెప్పింది. ‘నేనెప్పుడూ నవ్వుతూనే ఉంటా. ఒక్క నిమిషం దాన్ని ఆపినా వెంటనే కన్నీళ్లొస్తాయి. ‘శివపుత్రుడు’ షూటింగ్ టైంలో నిమిషం పాటు నవ్వకుండా ఉండాలని విక్రమ్ ఛాలెంజ్ చేశాడు. 30 నిమిషాలకే ఏడ్చేశా. మేకప్ అంతా పాడైపోయింది” అని లైలా చెప్పుకొచ్చింది.