‘యానిమల్’ బ్యూటీ త్రిప్తి డిమ్రి ఆ సినిమా నాటి రోజులను గుర్తు చేసుకుంది. ఈ సినిమాతోఆమెకు బీభత్సమైన క్రేజ్ వచ్చింది. అయితే ఈ సినిమాలో కీలకంగా ఉండే ఓ సన్నివేశంలో నటించడానికి ఆమె బాగా ఇబ్బంది పడాల్సి వచ్చిందట. ఆ సమయంలో రణ్‌బీర్ కపూర్ తనకు మద్దతుగా నిలిచారని త్రిప్తి ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. “యానిమల్’ చేస్తున్న సమయంలోనే మరో సినిమా కోసం కూడా పని చేశాను.
రోజూ రెండు షిఫ్ట్స్ పని చేయడం వల్ల నిద్ర లేక బాగా అలసిపోయేదాన్ని. ‘యానిమల్’లో రణ్‌బీర్ తో మాట్లాడుతున్న ఓ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ఇబ్బంది పడ్డాను. అది చాలా పెద్ద డైలాగ్.. పైగా సన్నివేశంలో భాగంగా క న్నీళ్లు పెట్టుకో వాల్సి ఉం టుంది.
నాకసలు ఏడుపు రా క చాలా స్ట్రెస్ ఫీలయ్యాను. నా పరిస్థితి అర్థం చేసుకున్న రణ్‌బీర్.. వాళ్ల సమయాన్ని నేను వృథా చేస్తున్నానన్న ఫీలింగ్ రాకుండా చాలా మద్దతుగా నిలిచారు. కూల్‌గా ఉండాలని తెలి పాడు” అని త్రిప్తి డిమ్రీ చెప్పుకొచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత బోల్డ్ ఇమేజ్ రావడంతో ‘ఆషికీ 3’లో అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిందని అంటున్నారు.