calender_icon.png 13 October, 2024 | 6:45 AM

గేమ్ చేంజర్ వచ్చేది అప్పుడే

09-10-2024 12:00:00 AM

రామ్ చరణ్ కథానాయకు డిగా రూపొందిన చిత్రం ‘గేమ్ చేంజర్’. ఈ చిత్రం విడుదల ఎప్పుడా అని అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్ర నిర్మాత దిల్ రాజు ఎక్కడకు వెళ్లినా ఆయనకు ఇదే ప్రశ్న ఎదురవుతోంది. ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్ రిలీజ్ డేట్ మాత్రమే కాకుండా మరికొన్ని విషయాలను సైతం సామాజిక మాధ్యమంలో ఓ పోస్ట్ ద్వారా పంచుకున్నారు.

దసరాకు టీజర్ రాలేదని నిరాశపడొద్దని, దీపావళికి తప్పక వస్తుందని తెలిపారు. ప్రతి నెల ఒక పాట చొప్పున విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ క్రమంలోనే అన్ని పాటల లిరిక్ వర్క్స్ పూర్తి చేసినట్టు తెలిపారు. అక్టోబర్ 30న ఒక పాట రానుందని వెల్లడించారు. సినిమా డిసెంబర్ 20న కచ్చితంగా ప్రేక్షకుల ముందుకు వస్తుందని తమన్ స్పష్టం చేశారు.