calender_icon.png 30 January, 2025 | 8:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రజాధనం వృథా చేయడమే వారి లక్ష్యం

30-01-2025 01:24:51 AM

  • ప్రతినెలా రూ 1,32,000 అదే ట్రాక్టర్లకు కిరాయి ఇచ్చిండ్రు

పక్కా ప్రణాళికతో అభివద్ధి పనులు చేపట్టండి 

మున్సిపల్ అధికారులతో దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి 

మహబూబ్ నగర్ జనవరి 29 (విజయ క్రాంతి) : ప్రజాధనాన్ని ఇలా దోచుకోవాలో మాత్రమే టిఆర్‌ఎస్ నేతలకు తెలుసని దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. బుధవారం భూత్పూర్ మున్సిపాలిటీ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో భూత్పూర్ మున్సిపాలిటీ అధికారులతో ఎమ్మెల్యే సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా మున్సిపాలిటీలో జరుగుతున్న పనులు, పెండింగ్ పనులు, కొత్తగా చేపట్ట బోయే పనుల గురించి అధికారులతో సుదీ ర్ఘంగా చర్చించారు.

గత బిఆర్‌ఎస్ ప్రభుత్వ పాలకులు భూత్పూర్ మున్సిపాలిటీని ఉద్ధ రించింది ఏమీ లేదని అన్నారు. అభివద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డుపడుతుందని తప్పు డు ఆరోపణలు చేయడానికి ఖండిస్తున్నా మన్నారు. గత అయిదేళ్ళుగా మున్సిపాలిటీ పనులకు ట్రాక్టర్ల అవసరం ఉన్న బిఆర్‌ఎస్ పాలకులు ట్రాక్టర్లను కొనకుండా కిరాయి ట్రాక్టర్లకు నెలకు రూ 1,32,000 ల చొప్పున వధా చేశారని తెలిపారు.

గత ఐదేళ్ల బిఆర్ ఎస్ పాలనలో మున్సిపాలిటీకి స్టాంప్ డ్యూ టీ ఆదాయం ఒక్క రూపాయి రాలేదని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి తీసుకు న్న నిర్ణయం వల్ల భూత్పూర్ మున్సిపాలిటీకి స్టాంప్ డ్యూటీ రూ 3 కోట్ల 98లక్షల ఆదా యం సంవత్సర కాలంలో వచ్చిందని తెలి పారు. అధికారంలోకి వచ్చిన వెంటనే తైబ జార్ రద్దు చేయడం జరిగిందని పేర్కొ న్నారు.

పక్కా ప్రణాళికలు తయారు చేయండి 

అమత్ నిధుల ద్వారా మున్సిపాలిటీ లో ఐదు ట్యాంకుల నిర్మాణానికి 5 ప్రాంతా లలో 500 గజాల భూమిని కేటాయిం చాల్సిందిగా, 590 స్తంభాలు ఏర్పాటు చేయాల్సిందిగా, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణా లకు, సీసీ రోడ్, డ్రైనేజ్, గ్రేవ్ యాడ్ కు, మహిళ భవన్ కు, మున్సిపాలిటీ సుందరీ కరణ పనులకు, టాయిలెట్స్ నిర్మాణాలకు, వాల్య తండా వద్ద డి ఆర్ సి ఏర్పాటుచేసి, డంప్ యార్డ్‌ను ప్రాసెస్ చేసే విధంగా ప్రపోజల్స్ తయారు చేయాలని అధికారు లకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.

భూత్పూర్ మండలంలో  R&B రోడ్డు నుండి వెల్కిచర్ల, మధిగట్ల బిటి రోడ్ కు 3, 58 కోట్ల రూపాయలు,  R&B రోడ్డు నుండి చౌల తండా, కరివేన బిటిరోడ్ కు 4,50 కోట్ల రూపాయలు, మహబూబ్ నగర్ నుంచి గాజులపేట్, తాటికొండ బిటి రోడ్ కు 65 లక్షలు మొత్తంగా 10 కోట్ల రూపాయలు ఎస్‌డిఎఫ్ నిధులు 76 లక్షలు భూత్పూర్ మండలానికి మంజూరు కావడం జరిగిందని పేర్కొన్నారు.