23-03-2025 12:20:18 AM
కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): నియోజకవర్గాల పునర్విభజ నపై ఆలులేదు చూలులేదు కొడుకు పేరు సోమలింగం..అన్నట్టుగా బీజేపీ వ్యతిరేకపక్షాలు వ్యవహరిస్తున్నాయని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు జీ కిషన్‌రెడ్డి విమర్శించారు.
నియోజకవర్గాల పునర్విభజనకు అనుసరించాల్సిన విధివి ధానాలు ఖరారు కాలేదని.. అయి నా దక్షిణాదికి అన్యాయం జరుగుతోందంటూ డీఎంకే, కాంగ్రెస్, బీఆర్‌ఎస్, కమ్యూనిస్టులు ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారన్నారు. ఈమేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. పైకి నియోజకవర్గాల పునర్విభజన అని చెప్తున్నప్పటికీ, వాస్తవానికి వారి ఎజెండా బీజేపీపై విషం కక్కడమేననేది స్పష్టమవుతోందన్నారు.
డీఎంకే ప్రజావ్యతిరేకత తప్పించుకోవడానికే డీలిమిటేషన్ పేరిట కుట్రలు పన్ను తోందని, దానికి కాంగ్రెస్, బీఆర్‌ఎస్, కమ్యూనిస్టులు వంత పాడుతున్నారని ఆరోపించారు. ఏ ఒక్క రాష్ట్రానికి అన్యాయం జరగకుండా.. డీలిమిటేష న్ చట్టాన్ని తీసుకొస్తామనే విషయాన్ని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా అనేక సందర్భాల్లో స్పష్టం చేశారని కిషన్‌రెడ్డి తెలిపారు.