- రాత్రికి రాత్రే ఎత్తుకెళ్తున్న దుండగులు
- లబోదిబోమంటున్న రైతులు
కరీంనగర్ సిటీ, డిసెంబరు 7: గత వారం రోజుల నుంచి రాత్రికి రాత్రే వ్యవసాయ బావుల వద్ద ఉన్న విద్యుత్ మోటార్లు చోరీకి గురవుతున్నాయి. వరి కోతలు పూర్తికావడం, కొత్త నారుమళ్లు పోసుకోవడంతో రైతులు బావుల వద్దకు వెళ్లడం కాస్త తగ్గించారు. ఇదే అదనుగా దుండుగులు అర్ధరాత్రి వేళల్లో బావుల వద్ద ఉన్న మోటార్లు, స్టార్టర్ల నుంచి విద్యుత్ వైర్లను తొలగించి ఎత్తుకెళ్తున్నారు.
నీళ్లలో ఉన్న మోటా ర్లను వైర్లతో సహా లాగి ఎత్తుకెళ్తున్నారు. ఒక్క మోటార్ విలువ సు మారు రూ.25 వేలు ఉంటుం ది. వైరు విలు వ రూ.35 వేల వరకు ఉంటుంది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. యాసంగికి పెట్టుబడులు సిద్ధం చేసుకుంటున్న తరుణంలో మోటార్లు ఎత్తుకెళ్లడంతో తమకు అదనపు భారమవుతుం దని వాపోతున్నారు. పోలీసు అధికారులు చర్యలు తీసుకొని దుండగులను పట్టుకోవాలని రైతులు కోరుతున్నారు.