calender_icon.png 12 December, 2024 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మెడికల్ షాపుల్లో చోరీలు

12-12-2024 02:43:11 AM

* మహారాష్ట్ర ముఠా పనే!

నిజామాబాద్, డిసెంబర్ 11 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలో బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో మెడికల్ దుకాణాలే టార్గెట్‌గా దుండగులు రెచ్చిపోయారు. రద్దీగా ఉండే బస్టాండ్ ప్రాంతంలో ప్రధాన రాహదారి పక్కనే గల దుకాణాల్లో చోరీలు జరిగాయి. పట్టణంలోని దొండి మెడికల్ షట్టర్ తాళాలు పగలగొట్టి రూ.3 లక్షల నగదు, కేర్ మెడికల్‌లో రూ.40 వేల నగదు, దీపక్ సీటీ స్కానింగ్ సెంటర్‌లో గల టీవీలను ఎత్తుకెళ్లారు. మహారాష్ట్ర పాసింగ్ కలిగిన వాహనంలో దుండగులు వచ్చి చోరీలకు పాల్పడినట్లు సీసీ కెమెరాల ఆధారంగా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలాన్ని ఏసీపీ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ పరిశీలించారు.