calender_icon.png 20 March, 2025 | 5:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జల్సాల కోసం దొంగతనాలు.. నిందితుల అరెస్ట్

20-03-2025 01:16:10 AM

జిల్లా ఎస్పీ రావుల గిరిధర్.

వనపర్తి టౌన్ మార్చి 19:  ఇళ్లలో దొంగతనాలు చేసి తాగుడుకు, జల్సాలు, కోడి పందేలు ఆడుటకు ఆడటం, ఇతర వ్యసనాలకు అలవాటుపడి త్వరగా ఎలాంటి కష్టం చేయకుండా డబ్బులు సంపాదించాలని తప్పుడు దారిలో  గొర్రెల దొంగతనం చేసి పోలీసులకు పట్టుడి జైలుకు వెళ్ళిన సంఘటన పానగల్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. బుధవారం జిల్లా కేంద్రం లోని ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడిం చారు.

గతంలో జైలుకు వెళ్ళిన సమయములో జైలులో జడ్చర్లకు చెందిన మూర్తి పరిచయమయ్యాడని తాళం వేసిన ఇండ్లల్లో దొంగతనం చేస్తే బంగారు, వెండి వస్తువులు,నగదు దొరుకుతాయని బంగారు, వెండి వస్తువులను అమ్ముకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయని నమ్మించాడు.

అతని మాటలకు ఆశపడిన నిందితులను పగటి పూట తాళం వేసి ఉన్న ఇళ్ళపై రెక్కి నిర్వహించి ముందుగా అనుకున్న పథకం ప్రకారం ఇంటి తాళాలు, బీరువా తాళాలు పగుల గొట్టి బీరువాలో ఉన్న బంగారు, వెండి వస్తువులు, నగదును దొంగిలించుకు పోవడం అలవాటుగా  మార్చుకున్నారు.

జలగరి ముత్తు, దుల్లోల రాజు, బొల్లిమోని అంజి,కిట్టు లు కలిసి 16 దొంగతనం కేసులు కాగా వనపర్తి జిల్లాలో 08 దొంగతనం కేసులు నాగర్ కర్నూల్ జిల్లాలో వివిధ మండలాల్లో  8 దొంగతనాలు చేయడం జరిగిందన్నారు. 

దొచుకున్న సొమ్మును  జల్సాలకు వినియోగించుకునేవారని నేరస్తులను పట్టుకుని, వారి నుండి 5 తులాల బంగారం, 3 లక్షల రూపాయలు స్వాదీనం చేసుకోవటం జరిగిందన్నారు. కార్యక్రమంలో వనపర్తి డిఎస్పి వెంకటేశ్వరరావు వనపర్తి సిఐ కృష్ణ ఎస్త్స్రలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.