calender_icon.png 15 March, 2025 | 5:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చోరీకి పాల్పడిన నిందితుడి అరెస్ట్

15-03-2025 12:00:00 AM

కూకట్ పల్లి మార్చి 14(విజయక్రాంతి):  సులువుగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితం గడపాలనే ఆశతో ఓ వ్యక్తి దొంగగా మారి పోలీసులకు చిక్కడు. ఈ సంఘటన కె పి హెచ్ బి కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శుక్రవారం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాలానగర్ డి సి పి సురేష్ కుమార్ నిందితుడి వివరాలు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఉప్పు సాయి తేజ (26) నగరానికి వచ్చి కెపిహెచ్బి కాలనీలో నివాసం ఉంటూ రాపిడో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. బెట్టింగ్ వ్యసనానికి పాల్ప డేవాడు అయితే అతనికి వచ్చిన జీతం సరిపోకపోవడంతో సులువుగా డబ్బు ఎలా సంపాదించాలని ఆలోచించి దొంగతనాన్ని ఎంచుకున్నాడు.

ఈ క్రమంలోనే ఈనెల 12వ తేదీన కెపిహెచ్బి కాలనీ టెంపుల్ బస్ స్టాప్ వద్ద ఉదయం ఓ మహిళ ఇంటిముందు ఆకిలి ఊడుస్తుండడాన్ని గమనించిన నిందితుడు మంకీ క్యాప్ ధరించి ఆమె వద్దకు వెళ్లి దాహమేస్తుందని మంచి నీళ్ళు అడిగాడు. సదురు మహిళ మానవతా దృక్పథంతో నిందితుడు తీసుకొచ్చిన బాటిల్ తీసుకెళ్లి తన ఇంట్లో వాటర్ నింపి తీసుకొచ్చే క్రమంలో ఆమె మెడలో ఉన్న తులం మంగళసూత్రాన్ని లాక్కొని పరారయ్యాడు.

బాధితురాలు అంజలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కెపిహెచ్బి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు నిందితుని గుర్తించి శుక్రవారం అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి తులం మంగళసూత్రాన్ని, ద్విచక్ర వాహనం, మొబైల్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కి తరలించారు. ఈ సమావేశంలో కుక్కట్‌పల్లి ఏసిపి శ్రీనివాసరావు, కెపిహెచ్బి సిఐ రాజశేఖర్ రెడ్డి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.