calender_icon.png 4 December, 2024 | 1:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రూ.14.50 లక్షలు చోరీ

14-11-2024 12:54:14 AM

బ్యాంకులో డ్రా చేసుకుని వస్తుండగా ఎత్తుకెళ్లిన దుండగులు

హుజూర్‌నగర్, నవంబర్ 13: సినీఫక్కీలో రూ.14.50 లక్షల చోరీ జరిగిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్ పట్టణంలో బుధవారం జరిగింది. పట్టణంలోని యా దగిరి లక్ష్మినరసింహ పార్‌బాయిల్డ్  రైస్ మిల్లులో వెంకటేశ్వర్లు గుమస్తాగా పనిచేస్తున్నాడు.

మిల్లుకు ధాన్యం అమ్మిన రైతులకు నగదును ఇచ్చేందుకు గాను పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న ఎస్‌బీఐ బ్రాంచీ నుంచి మధ్యాహ్నం మూడు గంటల సమయంలో రూ.14.50 లక్షల నగదును డ్రా చేసి బ్యాగులో పెట్టుకుని మిర్యాలగూడ రోడ్డులో ఉన్న మిల్లుకు బైక్‌పై బయలుదేరాడు.

ఇదంతా గమనించిన గుర్తు తెలియని ఇద్దరు దుండగులు ఓ స్పోర్ట్స్ బైక్‌పై వేగంగా వచ్చి వెంకటేశ్వర్లు వద్ద ఉన్న నగదు బ్యాగును ఒక్కసారిగా లాక్కొని వేగంగా కోదాడ వైపు పరారయ్యారు. వెంకటేశ్వర్లు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ముత్తయ్య తెలిపారు.