calender_icon.png 20 April, 2025 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రెచ్చిపోయిన దొంగలు

20-04-2025 08:30:27 PM

బాన్సువాడ (విజయక్రాంతి): బాన్సువాడ పట్టణంలోని సంగమేశ్వర కాలనీలో చోరి జరిగింది. చనంగారి అంజయ్య సోదరి, తల్లి సాయమ్మ ఇతర కుటుంబ సభ్యులు రాత్రిపూట ఉడకపోత ఉండడంతో కింద ఇంటికి తాళం వేసి పైన దాబాపై పడుకున్నారు. అర్ధరాత్రి సమయంలో తాళాలు పగల కొట్టి దొంగలు ఇంట్లో చోరబడి సుమారు 12 తులాల బంగారం, 20 తులాల వెండి, 21 వేల నగదు ఎత్తుకెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.