calender_icon.png 11 October, 2024 | 10:56 PM

పనిచేసే చోటే కన్నం

11-10-2024 08:43:05 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): చేసిన అప్పులను తీర్చాడానికి పనిచేసే చోటే కన్నం వేసిన ఓ వ్యక్తిని కటకటాల పాలు చేసింది. ఆదిలాబాద్ జిల్లా మావల పోలీస్ స్టేషన్ పరిధిలోని సాగర్ సూపర్ మార్కెట్ లో ఇటీవల దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు డీఎస్పీ జీవన్ రెడ్డి శుక్రవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. సాగర్ సూపర్ మార్కెట్ యజమాని సాగర్ తన సూపర్ మార్కెట్ లో చోరీ జరిగినట్లు ఫిర్యాదు చేయడం జరిగింది.

ఎస్పీ గౌష్ అలం ఆదేశాల మేరకే దర్యాప్తు చేసిన పోలీసులు సూపర్ మార్కెట్ గోడౌన్ ఇన్చార్జిగా పనిచేస్తున్న చోహన్ సుప్రభాత అనే వ్యక్తి ఈనెల 6వ తేదీన మాస్క్  ధరించి మార్కెట్లోని క్యాష్ కౌంటర్ లో ఉన్న రూ. 2 లక్షల 45 వేలు చోరీ చేశారని తెలిపారు. నిందితున్ని అరెస్ట్ చేసి, ఆయన దగ్గర నుండి మొత్తం 3 లక్షల 5 వేల నగదులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితున్ని పట్టుకోవడంలో కృషి చేసిన సీఐ ఫణిధర్, చంద్రశేఖర్, ఎస్సై విష్ణువర్ధన్ తో పాటు సిబ్బందిని డిఎస్పీ అభినందించారు. కాగా దుకాణాల యజమానులు రాత్రి వేళల్లో క్యాష్ కౌంటర్ లో ఎక్కువగా నగదును ఉంచకూడదని డిఎస్పి సూచించారు.