calender_icon.png 21 January, 2025 | 4:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్టీసీ బస్సులో రూ. 36 లక్షలు చోరీ

16-07-2024 04:02:12 PM

మహబూబ్ నగర్: ఆర్టీసీ బస్సులో 36 లక్షలు చోరీకి గురైన సంఘటన జడ్చర్ల బస్టాండ్ లో మంగళవారం చోటుచేసుకుంది. సీఐ ఆదిరెడ్డి తెలిపిన వివరాలు ప్రకారం... హైదరాబాద్ లోని బేగంపేట్ ట్రాన్స్​కోలో దామోదర్ అనే వ్యక్తి ఉద్యోగం చేస్తున్నాడు. దమోదార్ తన జీపీఎఫ్ డబ్బులు తీసుకొని తన చెల్లెలుకు ఇచ్చేందుకు హైదరాబాద్ నుంచి కర్నూలు ఆర్టీసీ బస్సులో బయలుదేరాడు. మొత్తం 36 లక్షలు ఒక బ్యాగులో రెండు లక్షలు మరో బ్యాగులో ఉంచుకొని బస్సులో లాగేజీలు పెట్టే చోట డబ్బులున్న బ్యాగ్ ను ఉంచారు. 

బస్సు విరామం కోసం  జడ్చర్ల బస్టాండ్ లో కొంత సమయం ఆగింది. ఆ సమయంలో దామోదర్ తన బ్యాగును పరిశీలించి చూడగా.. బ్యాగు మాత్రం ఉంచి అందులోని డబ్బులు చోరీకి గురైన్నాయి. తన డబ్బులు పోయినట్లు గుర్తించిన దామోదర్ జడ్చర్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దీంతో వెంటనే స్పందించిన పోలీసులు బస్టాండ్ లో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా, బస్సులో ఓ వ్యక్తి అటు ఇటు తిరుగుతున్నట్లు పోలీసులు గమనించారు. దీంతో బస్సును పూర్తిస్థాయిలో అదుపులోకి తీసుకున్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు డబ్బులు దొంగిలించిన వ్యక్తిని పట్టుకునేందుకు ప్రయత్నీస్తున్నట్లు సిఐ ఆదిరెడ్డి తెలిపారు.