మణుగూరు, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు పట్టణంలోని అశోక్ నగర్ ప్రాంతాల్లో గల ముత్యాలమ్మ గుడి లో చోరీ జరిగింది. ముత్యాలమ్మ గుడి గేటు తాళాలు పగలగొట్టి తలుపులు తీసి ఉండడంతో స్థానికంగా ఉన్న భక్తులు అనుమానం వచ్చి గుడి లోపల పరిశీలించారు. ముత్యాలమ్మ గుడి హుండీ తాళం కూడా పగలగొట్టి ఉండడంతో చోరీ జరిగిందని గుర్తించారు. హుండీలోనే నగదు తో పాటు ఇంకా ఏమైనా దొంగలు ఎత్తుకు వెళ్లారా విషయమై స్థానిక ప్రజలు పరిశీలిస్తున్నారు. చోరీ ఘటనపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయనున్నట్లు ఆ ప్రాంత ప్రజలు తెలిపారు.