బాలాజీ ఎలక్ట్రికల్ షాప్ ను పరిశీలిస్తున్న సీఐ దేవయ్య
బెల్లంపల్లి (విజయ క్రాంతి): బెల్లంపల్లి పట్టణంలో శనివారం అర్ధరాత్రి చిల్లరదొంగలు చెల్లరేగిపోయారు. రామ టాకీస్ పక్కన గల తిలక్ స్టూడియో, పండిత్ మెడికల్ స్టోర్, కే. రవీందర్ కిరాణం, బాలాజీ ఎలక్ట్రికల్ షాప్, వెనుక లైన్ లో గల దిగంబర కిరాణం షాపులలో దొంగలు పడ్డారు. పండిత్ మెడికల్ స్టోర్ లో రూ పదివేల నగదు చోరీకి గురైందని షాపు యజమాని తెలిపారు. బెల్లంపల్లి వన్ టౌన్ సీఐ ఎన్.దేవయ్య సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఫోరెన్సిక్ సిబ్బంది చోరీకి గురైన ఐదు దుకాణాల్లో ఆధారాలను సేకరించారు. బాలాజీ ఎలక్ట్రికల్ లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ఫుటేజీని పోలీసులు క్షుణ్ణంగా పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీల్లో దొంగల కదలికలు బయటపడ్డాయి. ఏది ఏమైనా ఒకేసారి ఐదు దుకాణాల్లో దొంగలు చోరీకి పాల్పడడం బెల్లంపల్లి పట్టణంలో వ్యాపారులను ఆందోళనకు గురిచేసింది.