calender_icon.png 15 November, 2024 | 5:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధూమ్ స్టుల్‌లో చోరీ.. కానీ..

05-09-2024 12:22:39 AM

  1. మ్యూజియంలో పోలీసులకు చిక్కిన దొంగ 
  2. గోడ దూకేందుకు ప్రయత్నించి తీవ్ర గాయాలు 
  3. భోపాల్ స్టేట్ మ్యూజియంలో ఘటన

భోపాల్, సెప్టెంబర్ 4: మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లోని స్టేట్ మ్యూజియంలో చోరికి పాల్పడిన దొంగ అనూహ్య రీతిలో పోలీసుల చేతికి దొరికాడు. మ్యూజియంలో రూ.కోట్ల విలువైన వందల ఏళ్లనాటి విలువైన పురాతన వస్తువులతో పారిపోయేం దుకు ఆ దొంగ ప్రయత్నించి విఫలమయ్యా డు. భోపాల్ కమిషనర్ హరినారాయణచారి వెల్లడించిన వివరాల ప్రకారం.. స్టేట్ మ్యూ జియంలోకి వప్రవేశించిన ఓ వ్యక్తి రాత్రంతా లోపలే ఉన్నాడు. ఉదయం భద్రతా సిబ్బం ది అతన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మ్యూజియానికి చేరుకున్న పోలీసులు అతన్ని అరెస్టు చేశారు.

నాణేలు, ఇతర వస్తువులు దొంగిలించి తప్పించుకునే ప్రయత్నంలో ఆ దొంగ గోడపైనుంచి దూకి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అపస్మారక స్థితికి చేరుకుని మ్యూజియంలోనే ఉండిపోయాడు అని వివరించారు. దొంగ దగ్గరి నుంచి గుప్తులు, ఢిల్లీ సుల్తానుల కాలం నాటి 100 నాణేలతో పాటు పురాతన నగలు, పాత్రలు, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీటి విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.10 నుంచి 12 కోట్ల విలువ చేస్తాయని సమాచారం. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.