calender_icon.png 25 December, 2024 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగల్‌పేట్‌లో చోరీ

19-10-2024 01:02:41 AM

నిర్మల్, అక్టోబర్18(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలో గురవారం అర్ధరాత్రి చోరీ జరిగిం ది. బంగల్ పేట్‌కు చెందిన చౌదరపు భూమయ్య ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లారు. అర్థరాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగుల గొట్టి  లోపలికి ప్రవేశించి 4 తులాల బం గారం, బీరువాలో ఉన్న రూ.90 వేల నగదును ఎత్తుకెళ్లారు. ఇంటి యజమాని శుక్రవారం ఇంటికి రాగా  తాళం తీసి  ఉంది. దీంతో ఇంట్లో దొంగతనం జరిగినట్టు భావించి పోలీసులకు సమాచారం అందించారు. పట్టణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని  దర్యాప్తు చేస్తున్నారు.