25-04-2025 08:33:28 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): మున్సిపాలిటీలోని ఆంధ్రబోర్ ఎయిర్టెల్ టవర్ ఏరియాలో గురువారం రాత్రి చోరీ జరిగిందిని సీఐ నరేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్మీలో పని చేస్తున్న బొప్పు శ్రీనివాస్ గురువారం తాళం వేసి వెంకట్రావు పేటలో ఓ ఫంక్షన్ కు వెళ్లారన్నారు. శుక్రవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా తలుపులు తెరిచి ఉన్నాయన్నారు. సుమారుగా రెండున్నర తులాల బంగారు గొలుసు, ఇరవై తులాల వెండి, రూ. 35 వేల నగదును దోచుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఎస్ఐ గోపతి సురేష్, తమ సిబ్బందితో కలిసి సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితుడు బొప్పు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.