23-04-2025 12:16:39 AM
అర్మూర్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి) : అర్మూర్ మున్సిపల్ పరిధిలోని యోగేశ్వర కాలనీలో తాళం వేసిన ఇంట్లో దొంగలు పడ్డారు. ఇంటి యజమాని యోగేశ్వర్ మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి బయటకు వెళ్ళగా అది గమనించిన దొంగలు తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడ్డారు.
ఇంట్లోని బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సుమారు ఐదున్నర తులాల బంగారు ఆభరణాలు, తులం వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. సంఘటనా స్థలాన్ని అర్మూర్ పోలీసులు పరిశీలించారు. ఇంటి యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యపు చేస్తున్నట్లు అర్మూర్ ఎస్.హెచ్.ఓ. సత్యనారాయణ గౌడ్ తెలిపారు.