05-04-2025 07:54:50 PM
కొండపాక: తాళం వేసిన ఇంట్లో దొంగతనం జరిగిన సంఘటన దుద్దెడ గ్రామంలో చోటు చేసుకుంది. త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన తిరుపతి శ్రీనివాస్ ఎలక్ట్రిసిటీ లైన్ ఇన్ స్పెక్టర్ గా పని చేయుచున్నారు. రోజు మాదిరిగానె శుక్రవారం ఉదయం తన భార్యను వ్యవసాయ పొలం వద్ద దింపి, తాను ఉద్యోగరీత్యా వెళ్లారు. తిరిగి సాయంత్రం 5 గంటలకు ఇంటికి వచ్చేసరికి తాళం తీసి ఉన్నది. అనుమానంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా బీరువాలొ ఉన్న రూ, 3 లక్షలు, 2,1/2 తులాల బంగారం, 40 తులాల వెండి ఆభరణాలు గుర్తుతెలియని దొంగలు ఇంట్లో లేని సమయంలో ఇంటి తాళం పగలగొట్టి దొంగతనానికి పాల్పడినారన్నారు. తిరుపతి శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీటౌన్ సీఐ విద్యాసాగర్ తెలిపారు.