15 తులాల బంగారం, లక్షన్నర నగదు చోరీ
నల్లగొండ, జనవరి 7 (విజయక్రాంతి): మిర్యాలగూడలోని కృష్ణ మానస కాలనీకి చెందిన పందిరి వేణు ఈ నెల 5న తన ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతికి వెళ్లాడు. మంగళవారం తెల్లవారుజామున ఇంటికి తిరిగి రాగా తలుపు తెరచి ఉన్నది. లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని 15 తులాల బంగారం, రూ.లక్షన్నర నగదు చోరీ చేసినట్లు గుర్తించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ రూరల్ ఎస్సై లోకేశ్ తెలిపారు.