29-03-2025 05:41:29 PM
చేగుంట (విజయక్రాంతి): చేగుంట మండలం వడియారం శ్రీ కనకదుర్గ వైన్స్ లో చోరీ జరిగింది. అర్థ రాత్రి వైన్స్ షేటర్లు పగలగొట్టి దొంగతనానికి పాల్పడిన దొంగలు, షాప్ షట్టర్ తొలగించి లోనికి చొరబడి 50 వేల నగదుతో పాటు 50 వేల మద్యం బాటిళ్లను తీసుకెళ్లినట్లు బాధితులు తెలిపారు. ఉదయం చోరీ విషయాన్ని గుర్తించిన స్థానికులు, బాధితులకు సమాచారం అందించగా యజమాని స్థానిక చేగుంట పోలీసులకు సమాచారం ఇచ్చారు. చేగుంట పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు.