ఆదిలాబాద్,ఆగస్టు 25(విజయ క్రాంతి): ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని వరుణ్ లిక్కర్ మార్ట్ వైన్స్ లో చోరీ జరిగింది. ఆదివారం తెల్లవారుజామున దొంగలు వైన్స్ షట్టర్ పగలగొట్టి లోకి చొరబడి చోరీకి పాల్పడ్డారు. ఉదయం వైన్స్ కు వచ్చిన సిబ్బందికి షట్టర్ పగలగొట్టి ఉండడాన్ని గమనించి, దొంగతనం జరిగినట్టు అనుమానం వ్యక్తం చేస్తూ సీసీ ఫుటేజ్ ను పరిశీలించారు. ముగ్గురు దుండగులు షాప్ లోని కౌంటర్ ను పగలగొట్టి నగదుతో పాటు సుమారు 1 లక్ష 50 వేల విలువ చేసే మద్యం బాటిల్లను చోరీ జరిగినట్లు బాధితులు తెలిపారు. షాపు యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ కెమెరాల్లో రికార్డయిన చోరీ దృష్యాలను పరిశీలించి, దర్యాప్తు చేపడుతున్నారు.