calender_icon.png 11 January, 2025 | 9:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రిటైర్డ్ ఐఏఎస్ ఇంట్లో చోరి.. నిందితుడు అరెస్ట్

10-07-2024 02:53:41 PM

రంగారెడ్డి: రిటైర్డ్ ఐఏఎస్ హరిబాబు ఇంట్లో చోరీ కేసులో నిందితుడిని బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ హరిబాబు నార్సింగ్ పీఎస్ పరిధిలోని గంధంగూడలో  కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయన ఇంటికి తాళం వేసి కుటుంబంతో కలిసి విజయవాడ వెళ్లారు. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో దొంగలు పడి కిలో బంగారం, ఒక ల్యాబ్ టాప్ ను ఎత్తుకెళ్లిపోయారని బాధితుడు తెలిపాడు.

విజయవాడ నుంచి తిరిగి వచ్చిన హరిబాబు తన ఇంట్లో దొంగలు పడ్డారని గుర్తించి నార్సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడు ప్రవీణ్ అరెస్టు చేశారు. నిందితుడి నుంచి 85 తులాల బంగారం స్వాధీనం చేసున్నారు. ప్రవీణ్ గతంలో పలు చోరీ కేసుల్లో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.