calender_icon.png 18 April, 2025 | 7:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్రాంత ఉద్యోగి ఇంట్లో చోరీ

10-04-2025 12:30:28 AM

70 వేల నగదు అపహరణ 

కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్ 9 (విజయక్రాంతి): కేంద్రంలోని కలెక్టర్ కార్యా లయం రోడ్ లో గల మాతృ శ్రీ డిగ్రీ కళాశాల సమీపంలో నివాసం ఉండే విశ్రాంత ఉద్యోగిని కొలిపాక వరలక్ష్మి ఇంట్లో చోరీ జరిగిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకా రం.... కొలిపాక వరలక్ష్మి గత కొన్ని సంవత్సరాలుగా తమ కుటుంబ సభ్యులతో నివాసం ఉంటున్నారు. అత్యవసర పనిమీద మంగళవారం తమ కుమార్తె గ్రామమైన కెరమెరి మండలానికి వెళ్లారు. బుధవారం ఉదయం వరలక్ష్మి కోడలు కవిత గమనించగా కాం పౌండ్‌వాల్‌కు సంబంధించినగేట్లకు వేసిన తాళాలు అలాగే ఉండగా ప్రధాన ద్వారం తలుపులకు సంబంధించిన బెడం పగలగొట్టి ఉంది.

భయభ్రాంతులకు గురైన ఆమె కోడలు కవిత వెంటనే తన అత్తమ్మ వరలక్ష్మికి ఫోన్ లో సమాచారం అందించగా ఆమె చేరుకుని ఇల్లు చిందరవందరగా పడి ఉండడాన్ని చూసి అవాక్కయ్యారు. అత్యవసర పనుల నిమిత్తం బీరువాలో దాచిన 70 వేల రూపాయల నగదు కనిపించకుండా పోయేసరికి బోరున విలపించారు. చోరీ జరిగిన విషయాన్ని తెలుసుకున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ బుద్దే రవీందర్ చోరీ జరిగిన తీరును పరిశీలించగా, ఫింగర్ ప్రింట్ పోలీసు అధికారు లు పలు ఆధారాలు సేకరించారు. బాధితురాలు వరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.