calender_icon.png 19 April, 2025 | 11:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టేకులపల్లి పల్లవి వైన్‌షాప్‌లో చోరీ

19-04-2025 06:23:08 PM

టేకులపల్లి (విజయక్రాంతి): టేకులపల్లి మండ‌ల కేంద్రంలో గ‌ల పల్లవి వైన్ షాపులో శుక్ర‌వారం రాత్రి చోరీ జ‌రిగింది. వైన్‌షాప్‌ కిటికీ గ్లాసులు పగలగొట్టి, ఇనుప చువ్వ‌ల‌ను తొలగించి దుండగులు మ‌ద్యం దుకాణంలోకి జొరపడ్డట్టు ఆనవాళ్లు ఉన్నాయి. దుకాణంలో మద్యం బాటిళ్లు, రూ.20 వేల న‌గ‌దుతో పాటు సిసి కెమెరాల హార్డ్ డిస్క్ కూడా అప‌హ‌రించుకు పోయిన‌ట్లు నిర్వాహ‌కులు తెలిపారు. మద్యం దుకాణం యజమాని ఫిర్యాదు మేరకు టేకులపల్లి సీఐ తాటిపాముల సురేశ్‌, ఎస్ఐ రాజేందర్ వైన్‌షాపును ప‌రిశీలించారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలు సేకరించి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.