calender_icon.png 25 December, 2024 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డాక్టర్ ఇంట్లో భారీ చోరీ

24-12-2024 05:11:03 PM

రంగారెడ్డి,(విజయక్రాంతి): రాజేంద్రనగర్ పరిధి బండ్లగూడలోని విల్లాలో మంగళవారం చోరీ జరిగింది. మ్యాపిల్ టౌన్ షిప్ విల్లాలో డాక్టర్ కొండల్ రెడ్డి నివాసం ఉంటున్నాడు. బిహార్ కు చెందిన ఇద్దరు దంపతులు వైద్యుడి ఇంట్లో నెలక్రితం పని మనుషులుగా చేరారు. ఇవాళ ఉదయం నిద్రలేచి చూసేసరికి బిహర్ దంపతులు కనిపించకుండా పోయ్యారు. ఇంటిన్ని పరిశీలించిన చూసిన కొండల్ రెడ్డి రూ.45 లక్షల బగారం, వెండి ఆభరణాల, రూ.55 వేలు నగదు దొంగతనం చేసి పరారైనట్లు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం డాక్టర్ కొండల్ రెడ్డి రాజేంద్రనగర్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.