calender_icon.png 19 April, 2025 | 7:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాచారం రామాలయంలో చోరీ

16-04-2025 07:22:54 PM

పెన్ పహాడ్: సూర్యాపేట జిల్లా పెన్ పహాడ్ మండలం మాచవరం గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో గుర్తు తెలియని దొంగలు దేవాలయం తలుపుల బేడం పగలగొట్టి చోరీ చేశారు. ఎస్సై గోపికృష్ణ తెలిపిన వివరాల ప్రకారం.. గుర్తులేని దొంగలు ఆలయంలో చొరబడి అమ్మవారి మెడలో ఉన్న ఎనిమిది గ్రాముల పూస్తే, వెండి వస్తువులు, శఠగోపం దొంగిలించుకుని వెళ్లారని ఆలయ చైర్మన్ బొల్లక బొబ్బయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.