బెల్లంపల్లి, (విజయక్రాంతి): బెల్లంపల్లి మండలం లో ని కన్నాల రహదారి పైగల బంగారు మైసమ్మ ఆలయంలో సోమవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడిన విషయం బుధవారం వెలుగుచూసింది. సోమవారం రాత్రి ఆలయం తలుపులు మూసి వెళ్లిన సిబ్బంది మంగళవారం ఉదయం ఆలయం తలుపులు తెరిచి చూసేసరికి బీరువా తెరిచి ఉంది. నగలు కనిపించకపోవడం తో ఆలయ అర్చకులు చోరీ జరిగినట్లు ఆలయ అధ్యక్షునికి తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో బుధవారం తాళ్ల గురిజాల ఎస్సై రమేష్ ఆలయ పరిసరాలను డాగ్ స్క్వాడ్ సిబ్బందితో పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రమేష్ వెల్లడించారు.