calender_icon.png 22 February, 2025 | 11:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డ్రైఫ్రూట్స్ దుకాణంలో దొంగతనం

22-02-2025 12:00:00 AM

మహబూబాబాద్, ఫిబ్రవరి 21 (విజయ క్రాంతి) : మహబూబాబాద్ జిల్లా పట్టణ కేంద్రం ఓ డ్రై ఫ్రూట్స్ దుకాణంలో దొంగతనం శుక్రవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా పట్టణ కేంద్రంలోని నెహ్రు సెంటర్లోని శ్రీ సాయి బాలాజీ డ్రైఫ్రూట్స్ కిరాణా షాప్ లో దొంగలు గడ్డపారతో తలుపులు పగలగొట్టి లోనికి ప్రవేశించి 60 వేల రూపాయల విలువైన సుగంధ ద్రవ్యాలను అదేవిధంగా డ్రై ఫ్రూట్స్ ను దొంగిలించినట్లు సమాచారం.

సిసి ఫుటేజ్ హార్డ్ డిస్క్ సైతం చోరీకి గురైంది. ఈ సందర్భంగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేసున్నా ఇటీవల కాలంలో మహబూబాబాద్ పట్టణ కేంద్రంలో పలు దొంగతనాలు వ్యాపారులను భయపెడుతు న్నాయని కలవరానికి గురవుతున్నారు. పోలీసులు పెట్రోలింగ్ చేస్తూ రాత్రి వేళలో షాపులలో చోరీలు జరగకుండా చూడాలని డిమాండ్ చేస్తున్నారు.