calender_icon.png 2 February, 2025 | 10:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెట్టు ఎక్కిన చిరుత.. వీడియోలు తీసిన యువత

02-02-2025 07:22:04 PM

సోషల్ మీడియాలో వైరల్..

కుమ్రం భీం ఆసిఫాబాద్ (విజయక్రాంతి): చిరుతపులి చెట్టు ఎక్కి హల్చల్ చేసిన సంఘటనను కొంతమంది యువకులు వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో హాట్ టాపిక్ గా మారింది. తిర్యాని మండలం చింతపల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో చిరుతపులి సంచరించినట్లు గ్రామస్తులు తెలిపారు. చిరుతపులి చెట్టుపై ఉన్న సమయంలో కొంతమంది యువకులు వీడియో తీసి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో పోస్ట్ చేయడంతో హల్చల్ అయింది. ఎఫ్ఆర్వో శ్రీనివాస్ చిరుత పాదముద్రలను దర్శించడం జరిగిందని ప్రజలు అడవి ప్రాంతంలో తిరగవద్దని కోరారు.