నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్ సునీల్ రాథోడ్ స్వామి...
కామారెడ్డి (విజయక్రాంతి): యువత వివేకానందుని ఆదర్శంగా తీసుకోవాలని జాతీయ నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్ సునీల్ రాథోడ్ స్వామి అన్నారు. ఆదివారం జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా కామారెడ్డి జిల్లా నస్రూల్లాబాద్ మండలంలోని సంగం తండాలో జాతీయ యువజన దినోత్సవం కార్యక్రమాన్ని సేవా సంఘం ప్రెండ్స్ యూత్ అసోసియేషన్, నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్ సునిల్ రాథోడ్ స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ... కేవలం 39 సంవత్సరాల వయస్సులోనే యువతకు స్పూర్తి ప్రదాత, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన స్పూర్తి ప్రదాత, భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలకు దాటి చెప్పిన మార్గదర్శి స్వామి వివేకానంద అని అన్నారు. నేటి తరం యువత స్వామి వివేకానందుని ఆదర్శంగా తీసుకుంటే ఆయన అంతటి వారు కాకున్నా జీవితంలో ఏదైనా సాధించాలని అనుకుంటే కచ్చితంగా ఆయన స్పూర్తిగా తీసుకొని సాధిస్తారని ఈ సందర్భంగా ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘం నాయకులు దూప్‌సింగ్, మోహన్, మధన్, సుమన్, సునిల్, రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.