20-04-2025 11:03:08 PM
రాజాపూర్: నేటి యువతరం ఛత్రపతి శివాజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకొని దేశ సేవకు పాటుపడాలని ఎంపీ డీకే అరుణ(MP DK Aruna), ఆదిత్య పరశ్రీ స్వామి అన్నారు. ఆదివారం మండలంలోని చెన్నవేల్లి గ్రామంలో చించొడ్ రేణుకాదేవి జ్ఞాపకార్థం చించొడ్ అభిమన్యు రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ మహరాజ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, యాదిరెడ్డి, దుష్యంత్ రెడ్డి, శ్రీను నాయక్, యాదయ్య, నర్సింలు, ఆనంద్ వివిధ పార్టీల నాయకులు యువజన, సంఘాల నాయకులు పాల్గొన్నారు.