శ్రీపాద ట్రస్ట్ క్రికెట్ పోటీల ప్రారంభోత్సవంలో దుద్దిళ్ల శ్రీనుబాబు...
రామగిరి (విజయక్రాంతి): యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా, శారీరక ధృడత్వం, మానసికోల్లాసం కలిగించే క్రీడల్లో పాల్గొనలని కాంగ్రెస్ యువ నాయకుడు దుద్దిల శ్రీనుబాబు సూచించారు. శుక్రవారం రామగిరి మండలంలోని రాణి రుద్రమదేవి స్టేడియంలో మండల కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో అజాతశత్రువు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ శాసనసభావతి శ్రీపాద రావు స్మారకార్థం మంథని డివిజన్ స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ను మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు దుద్దిళ్ల శ్రీను బాబు శుక్రవారం కాంగ్రెస్ నాయకులు, నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన క్రీడాకారులతో మాట్లాడుతూ... యువత చెడు వ్యసనాల బారిన పడకుండా శారీరక ధృడత్వం, మానసికోల్లాసం కలిగించే క్రీడల్లో పాల్గొని, క్రీడా స్ఫూర్తిని ప్రదర్శిస్తూ పోటీలలో పాల్గొని క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించాలని సూచించారు. క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఓడినవారు కృంగిపోకుండా గెలుపు కోసం ప్రయత్నం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రు రమాదేవి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట్ల తిరుపతి యాదవ్, జిల్లా ఉపాధ్యక్షులు చొప్పరి సదానందం, మండల అధ్యక్షులు రొడ్డ బాపన్న, మాజీ ఎంపీపీ దేవక్క కొమురయ్య గౌడ్, కాంగ్రెస్ నాయకులు ముస్యల శ్రీనివాస్ కాటన్ సత్యం, తదితరులు పాల్గొన్నారు.