calender_icon.png 19 February, 2025 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నను హత్య చేయించిన తమ్ముడు

15-02-2025 01:25:52 AM

  • 48 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు
  • ఆరుగురు నిందితుల అరెస్ట్
  • కార్, మూడు కత్తులు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం 
  • వివరాలు వెల్లడించిన ఎస్పీ 

గద్వాల, ఫిబ్రవరి 14 ( విజయక్రాంతి ) : ఒక తల్లి కడుపున పుట్టి కష్టసుఖాల్లో కలిసి మెలిసి ఉంటాడు అనుకున్న అన్న ను ఆస్థి కోసం తమ్ముడు హత్య చేయించిన సంఘట న గద్వాల జిల్లాలో చోటు చేసుకుంది.  శుక్ర వారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో హత్య కు గల వివరాలను జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు మీడియాకు వెల్లడించారు.

గద్వాల జిల్లా శాంతి నగర్ మండలం యాప దీన్నే గ్రామానికి చెందిన సంధ్య పోగు రమే ష్ ను ఈ నెల 12 వ తేదీన మద్దూర్ స్టేజి గుర్తు తెలియని వాహనం ఢీ కొని మృతి చెందాడని తన భర్త మృతిపై అనుమానాలు ఉన్నాయని భార్య సంద్య పోగు చంద్రకళ పిర్యాదు చేయడం జరిగిందన్నారు.

కేసును ఛాలెంజింగ్ తీసుకుని డిఎస్పీ వై.మోగిల య్య, సిఐ టాటాబాబు ఆధ్వర్యంలో  ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసి టాటాబాబు సిఐ ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసి సిసి  కెమెరాలు, ఇతర సాంకేతిక  మరియు నైపుణ్యం ఆదారంగా నిందితులను గుర్తించి నమ్మదగిన సమాచారం మేరకు నిఘా ఉంచగా వారు అడ్వకేట్ కోసం  హైదరాబాద్‌కు కారులో పోతుండగా జాతీయ రహదా రిపై జల్లపూర్ ఆర్‌టిఏ చెక్ పోస్ట్ దగ్గర శుక్ర వారం మధ్యాహ్నం 02:00 గంటలకు నిందితులను అరెస్టు చేసి విచారించగా చేసి న నేరాన్ని ఒప్పుకున్నారన్నారు.

మొత్తం లో ఏడు మందిలో ఒకరు పరారిలో ఉండగా మిగిలిన అరుగురిని అరెస్ట్ చేసి వారి నుండి ఒక కార్, మూడు కత్తులు నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం  చేసుకోవడం జరిగిందన్నా రు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపి న అయిజ, మానవపాడు ఎస్‌ఐలు, సిబ్బం ది లను ఎస్పీ ప్రత్యకంగా అభినందించి క్యాష్ రివార్డ్ ను అందచేశారు.