కెఏ పాల్...
కరీంనగర్ (విజయక్రాంతి): కరీంనగర్ లో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమ్మె శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపిన ప్రజాశాంతి పార్టీ అధినేత కె.ఏ.పాల్(Praja Shanti Party leader K.A. Pal) ఉద్యోగుల సమస్యపై సీఎం(CM Revanth Reddy)తో చర్చించానని, రేపు ఢిల్లీకి సైతం వెళ్తున్నాని అన్నారు. కేసీఆర్(KCR) 8 లక్షల కోట్ల అప్పులు చేశారు. అప్పులతో తమ్ముడు రేవంత్ రెడ్డి సతమతం అవుతున్నారని ఆన్నారు. రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో సమగ్ర శిక్ష ఉద్యోగులు పోటీ చేయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఎదగాలన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజాశాంతి పార్టీ మద్దతుతో సర్పంచ్ గా గెలిచి సత్తాచాటాలని సూచించారు. ఏపీ, తెలంగాణలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని తెలిపారు. క్రిస్టియన్ ను పెళ్లి చేసుకున్న పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం గురించి మాట్లాడవద్దని అన్నారు. కేటిఆర్(KTR) పై మాట్లాడుతూ.. అవినీతికి పాల్పడిన వారిని జైల్లో పెట్టాలన్నారు.